తెలుగు తెరపై అక్కినేని నాగార్జున గీతాంజలి చిత్రం రీ రిలీజ్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హైదరాబాద్
అక్కినేని నాగార్జున హీరోగా నటించిన కల్ట్ క్లాసిక్ ప్రేమ కథా చిత్రం గీతాంజలి నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రీ రిలీజ్ కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ అద్భుతమైన చిత్రాన్ని డిజిటల్ ఫోర్ కే వెర్షన్ లో తెలుగు, తమిళ భాషల్లో భారీగా విడుదల చేయనున్నారు. ఇళయరాజా సంగీతం అందించిన ఈ క్లాసిక్ మూవీ మరోసారి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడానికి సిద్ధమవుతోంది అని అన్నపూర్ణ స్టూడియోస్ వెల్లడించింది.