తుపాను ముప్పుపై కలెక్టరేట్లో అధికారులతో కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సమీక్ష

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: విజయనగరం

బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్రమవుతున్న నేపథ్యంలో విజయనగరం కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి బుధవారం రాత్రి కలెక్టరేట్ కంట్రోల్ రూమ్లో తుపాను పరిస్థితిని సమీక్షించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను అప్రమత్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో పాల్గొని జిల్లాలో చేపట్టిన సహాయక చర్యలను వివరించారు. తీర ప్రాంతంలో గాలుల తీవ్రత దృష్ట్యా అత్యవసర శాఖల సిబ్బంది అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.