కడ్తాల్లో కొనసాగుతున్న సుంకిరెడ్డి మెగా ఉచిత కంటి వైద్య శిబిరం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: కడ్తాల్
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలో సుంకిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా ఉచిత కంటి వైద్య శిబిరం మూడవ రోజు కూడా అత్యంత విజయవంతంగా కొనసాగింది. ఈ శిబిరానికి ప్రజల నుండి విశేష స్పందన లభించగా, సుమారు 850 మందికి పైగా హాజరయ్యారు. నిర్వాహకులు 550 మందికి పైగా రోగులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, 320 మందికి అద్దాలు పంపిణీ చేశారు. అలాగే కంటి శుక్లాలతో బాధపడుతున్న 28 మందిని శస్త్రచికిత్సల నిమిత్తం ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.