కొఠియాలో తీవ్ర ఉద్రిక్తత: ఒడిశా పోలీసుల బారికేడ్లను తొలగించిన ఏపీ గిరిజనులు
రిపోర్టర్: రాము
స్థలం: సాలూరు
ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దులోని కొఠియా వివాదాస్పద గ్రామం నేరేడివలసలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది అని పోలీసులు తెలిపారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రేషన్ సరకుల వాహనాన్ని ఒడిశా పోలీసులు అడ్డుకోవడంతో గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒడిశా పోలీసుల బారికేడ్లను నేలకూల్చి, తమకు ఆ రాష్ట్ర పథకాలు వద్దంటూ నిరసన తెలిపారు. ఏపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలే తమకు కావాలని స్పష్టం చేసిన గిరిజనులపై ఒడిశా వర్గాలు దాడికి పాల్పడటం కలకలం రేపింది.