భారీ బిజినెస్ తో దూసుకుపోతున్న సందీప్ కిషన్ సిగ్మా సినిమా
రిపోర్టర్: మహేష్
స్థలం: తెలంగాణ
సందీప్ కిషన్ హీరోగా జేసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హైస్ట్ థ్రిల్లర్ 'సిగ్మా' సినిమాపై బిజినెస్ వర్గాల్లో భారీ క్రేజ్ నెలకొంది. కోస్తాంధ్ర, తెలంగాణ రైట్స్‌ను మైత్రీ డిస్ట్రిబ్యూషన్ దక్కించుకోగా, సీడెడ్ బాధ్యతలను ఎన్వీఆర్ సినిమా తీసుకుంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 2న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.