'అమరావతి ఈ-ఛాంపియన్స్‌' జట్టు క్రీడాకారిణులకు ఘనస్వాగతం

రిపోర్టర్: రాము స్థలం: విజయవాడ

మంగళగిరిలో ఈ నెల 19 నుంచి డబ్ల్యూఏపీఎల్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో అమరావతి ఈ-ఛాంపియన్స్‌ జట్టు క్రీడాకారిణులు విజయవాడకు చేరుకున్నారు. బుధవారం సాయంత్రం విజయవాడలోని జీఆర్‌టీ హోటల్‌లో బస చేసేందుకు విచ్చేసిన క్రీడాకారిణులకు హోటల్ సిబ్బంది తిలకం దిద్ది, పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా స్వాగతం పలికారు. ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థ అమరావతి ఈ-ఛాంపియన్స్‌ జట్టును దక్కించుకున్న విషయం తెలిసిందే.