తిరుమల రెండో ఘాట్ రోడ్డులో వాహనదారులకు కనిపించిన చిరుత
రిపోర్టర్: అశోక్
స్థలం: తిరుమల
తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్డులో వినాయక ఆలయం సమీపంలో చిరుత సంచరించడాన్ని వాహనదారులు గుర్తించారని అటవీ శాఖ అధికారులు తెలిపారు. రోడ్డుపై చిరుత ప్రత్యక్షం కావడంతో ప్రయాణికులు, భక్తులు ఒక్కసారిగా తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనపై వెంటనే అప్రమత్తమైన టీటీడీ అధికారులు మరియు అటవీ సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించి భద్రతా చర్యలు ముమ్మరం చేశారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని, ఘాట్ రోడ్డులో ప్రయాణించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు.