గుజరాత్ లో దారుణం: కుమారుడిని బలిచ్చిన మానసిక వికలాంగుడైన తండ్రి
రిపోర్టర్: నరేష్
స్థలం: Ahmedabad
అహ్మదాబాద్ జిల్లాలోని విన్చియా గ్రామంలో మానసిక పరిస్థితి సరిగా లేని నరేష్ పటేల్ అనే వ్యక్తి తన పదేళ్ల కుమారుడు కరణ్‌ను దేవుని బలిపీఠంపై తల బాది దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబంలో మరెవరూ పూజారి బాధ్యతలు చేపట్టకుండా ఉండేందుకే ఈ నరబలి ఇచ్చినట్లు నిందితుడి భార్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. హత్య అనంతరం నిందితుడు మృతదేహం పక్కనే నిద్రపోవడం తీవ్ర కలకలం రేపింది.