జనసేనలోకి తుని సీనియర్ నేత యనమల కృష్ణుడు

రిపోర్టర్: హరి స్థలం: తుని

తుని రాజకీయాల్లో సీనియర్ నేత యనమల కృష్ణుడు జనసేన పార్టీలో చేరనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఒకప్పుడు టీడీపీలో కీలకంగా వ్యవహరించి 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన ఆయన, తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే కుటుంబ సభ్యుల అనారోగ్య కారణాల వల్ల ఈ కార్యక్రమం వాయిదా పడినట్లు తెలుస్తుండగా, త్వరలోనే విజయవాడ వేదికగా ఆయన జనసేన కండువా కప్పుకోనున్నారు.