రైతుల కష్టాలు గాలికొదిలేసి పర్యటనలు చేస్తున్నారంటూ రేవంత్ సర్కార్పై హరీష్ రావు ఆగ్రహం

రిపోర్టర్: హరి స్థలం: సిద్దిపేట

రాష్ట్రంలో కరువు పరిస్థితులతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు గోవా, ఢిల్లీ ట్రిప్పులు వేస్తున్నారని హరీష్ రావు ఆఫీస్ (Harish Rao Office) ఎద్దేవా చేశారు. రైతుల పట్ల, రాష్ట్రం పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న బాధ్యత ఇదేనా అని వారు ప్రశ్నించారు. ఈ మేరకు మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.