జేఈఈ అడ్వాన్స్‌డ్ లేకుండానే ఐఐటీ విద్యను అభ్యసించే అద్భుత అవకాశం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: తమిళనాడు
ఐఐటీ మద్రాస్ మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాయకుండానే విద్యార్థులు ఐఐటీలో డేటా సైన్స్ బీఎస్ కోర్సు చదివే సువర్ణ అవకాశాన్ని కల్పిస్తోంది. నాణ్యమైన ఉన్నత విద్యను మరింత మందికి చేరువ చేయడమే లక్ష్యంగా ఈ ఆన్‌లైన్ కోర్సును నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఉద్యోగులు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా ఈ కోర్సులో చేరేందుకు వెసులుబాటు కల్పించారు.