టాలీవుడ్ లో దర్శకుడు సుజీత్ తదుపరి సినిమాపై జోరుగా ప్రచారం

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

టాలీవుడ్ లో ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ సుజీత్ తదుపరి ప్రాజెక్ట్ ఎవరితోననే అంశం హాట్ టాపిక్ గా మారింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో ఓజీ సినిమా తర్వాత, సుజీత్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో భారీ యాక్షన్ మూవీ చేయబోతున్నారనే ప్రచారం సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అయితే ఈ కాంబినేషన్ పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.