లూధియానాలో దారుణం: రియల్టర్ పై దుండగుల కాల్పులు, కంటతడిపెట్టిస్తున్న ఘటన
రిపోర్టర్: శివ
స్థలం: Ludhiana
పంజాబ్ రాష్ట్రంలోని లూధియానాలో భీకర ఘటన చోటుచేసుకుంది. మాజీ కాంగ్రెస్ కార్యకర్త అయిన జగజోత్ సింగ్ పై దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. కుటుంబంతో కలిసి కారులో ఉన్న సమయంలో సుమారు ఎనిమిది మంది దుండగులు ఈ దాడికి పాల్పడ్డారని బాధితుడు తెలిపారు. కంటి సమీపంలో గాయాలైనప్పటికీ ఆయన ధైర్యంగా కారు నడుపుకుంటూ సివిల్ ఆసుపత్రికి చేరుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. రాజకీయ కక్షలే ఈ దారుణానికి కారణమని పోలీసులు వెల్లడించారు.