శ్వాసలో వచ్చే ఇబ్బందులు గుండె జబ్బుల ముప్పేనని హెచ్చరిస్తున్న వైద్యులు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: హైదరాబాద్

మెట్లు ఎక్కుతున్నప్పుడు లేదా నడుస్తున్నప్పుడు వచ్చే ఆయాసాన్ని కేవలం సాధారణ అలసటగా భావించి నిర్లక్ష్యం చేయకూడదని సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రామకృష్ణ జానపాటి స్పష్టం చేశారు. వైద్య పరిభాషలో దీనిని డిస్ప్నియా అంటారని, ఇది గుండె పనితీరులో లోపాలు లేదా రక్తనాళాల సమస్యలకు ప్రధాన హెచ్చరిక కావచ్చని ఆయన వెల్లడించారు. ఛాతీ నొప్పి లేకపోయినా విపరీతమైన చెమటలు, కాళ్ల వాపులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని ఆయన సూచించారు.