దసరా ఉత్సవాల నిర్వాహకులకు తీపి కబురు: మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా

రిపోర్టర్: భాస్కర్ స్థలం: అమరావతి

రాష్ట్రంలో దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే మండపాలకు మూడు కిలోవాట్లు, పట్టణ ప్రాంతాల్లో ఐదు కిలోవాట్ల వరకు ఉచిత విద్యుత్ వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో ఉత్సవ నిర్వాహకులపై ఆర్థిక భారం గణనీయంగా తగ్గనుందని, ప్రజలు పండుగను ఆనందోత్సాహాలతో ఘనంగా జరుపుకోవాలని ఆయన కోరారు.