22ఏ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే యోచనలో ప్రభుత్వం
రిపోర్టర్: నరేష్
స్థలం: తెలంగాణ
తెలంగాణలో తీవ్ర ఆందోళనకు కారణమైన 22ఏ నిషేధిత భూముల సమస్యను పరిష్కరించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. దశాబ్దాలుగా ఇళ్లు నిర్మించుకుని నివాసముంటున్న బాధితులకు ఊరటనిస్తూ, సదరు ప్రాంతాలను 22ఏ జాబితా నుంచి తొలగించేలా అసెంబ్లీలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. దీనివల్ల వేలాది మధ్యతరగతి కుటుంబాలకు పూర్తి స్థాయి యాజమాన్య హక్కులు దక్కనున్నాయి.