తండ్రిని హత్య చేయించేందుకు సుపారీ ఇచ్చిన కుమారుడు సుబ్రత్ అరెస్ట్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Kanpur
కాన్పూర్‌లో సంచలనం సృష్టించిన మందుల వ్యాపారి వినీత్ మినోచా హత్య కేసులో దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు ఆయన కుమారుడు సుబ్రత్‌ను బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. తండ్రిని హత్య చేసేందుకు నిందితుడు విశాల్ గౌతమ్‌కు ఆరు లక్షల రూపాయల సుపారీ ఇవ్వడమే కాకుండా, దొరికిపోతే తన భార్య షాలు పేరు చెప్పాలని సూచించినట్లు విచారణలో తేలిందని పోలీస్ కమిషనర్ రఘుబీర్ లాల్ వెల్లడించారు. అప్పుల బాధతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.