జాతీయ రహదారి పనుల్లో అధికారుల ఇష్టారాజ్యం, చిరువ్యాపారుల ఆందోళన

రిపోర్టర్: కృష్ణ స్థలం: నెల్లూరు

కావలిలో సీతారామపురం-కాని జాతీయ రహదారి విస్తరణ పనుల్లో అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. చిన్న దుకాణాలను తొలగిస్తూ ఉపాధిని దెబ్బతీస్తున్నారని చిరువ్యాపారులు ఆరోపిస్తున్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేట్ భవనాల విషయంలో ఒకలా, పేదల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.