'మతాన్ని అడ్టుపెట్టుకుని పదవులు పొందారు': విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు
రిపోర్టర్: అశోక్
స్థలం: ఆంధ్రప్రదేశ్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసిన సంచలన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. వైఎస్సార్సీపీలో ఎమ్మెల్యే టికెట్లు, మంత్రి పదవుల కోసం ఎంతమంది నాయకులు మతం మార్చుకున్నారో పార్టీలో నంబర్‌వన్ గా ఉన్నవారే సమాధానం చెప్పాలని ఆయన బుధవారం డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి క్రైస్తవ సభలో మాట్లాడిన వీడియోను ట్యాగ్ చేస్తూ రాజకీయ పదవుల కోసం మతాన్ని వాడుకున్న తీరును విజయసాయి రెడ్డి తీవ్రంగా ఎండగట్టారు.