ఆమనగల్లులో మహిళల కోసం ఉల్లాస్ నవభారత సాక్షరత పరీక్ష
రిపోర్టర్: Mohammad Abdul Azeem
స్థలం: ఆమనగల్
రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పురపాలక సంఘం పరిధిలో ఉల్లాస్ నవభారత సాక్షరత కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘాల నిరక్షరాస్యులైన మహిళల కోసం ఫౌండేషన్ లీటరసీ అండ్ న్యూమరసీ అసెస్మెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ ప్రత్యేక పరీక్షా కార్యక్రమంలో వివిధ సంఘాలకు చెందిన 222 మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పరీక్ష నిర్వహణ పర్యవేక్షణ బాధ్యతలను మేనేజర్ ఆంజనేయులు సమర్థవంతంగా నిర్వర్తించారని కమిషనర్ తెలిపారు.