ఖమ్మంలో ముమ్మర సర్వేతో కుష్టు వ్యాధికి శాశ్వతంగా చెక్ పెట్టనున్న వైద్యశాఖ
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మం జిల్లాలో అక్టోబర్ ఇరవై రెండు నుంచి నవంబర్ నాల్గవ తేదీ వరకు కుష్టు వ్యాధి గుర్తింపు ప్రచారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ డాక్టర్ డి రామారావు వైద్య సిబ్బందికి శిక్షణ ప్రారంభించారు. కుష్టు వ్యాధిని ప్రారంభ దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చన్నారు. చర్మంపై స్పర్శలేని మచ్చలు కనిపిస్తే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని ఆయన ప్రజలకు సూచించారు.