వినాయక చవితి వేళ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన వైసిపీ కార్యకర్త
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: వింజమూరు
నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని ప్రజలకు మరియు గుంపర్లపాడు గ్రామస్తులకు వైసిపీ కార్యకర్త వల్లెపు అనిల్ కుమార్ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశుని ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ పండగను ప్రజలందరూ ఎంతో సంతోషంగా, జాగ్రత్తగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో వేడుకలు నిర్వహించుకోవాలని కోరారు.