ప్రధాన ఎన్నికల కమిషనర్ గ్యానేశ్ కుమార్ తీరుపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: New Delhi
ముఖ్య ఎన్నికల కమిషనర్ గ్యానేశ్ కుమార్ నిర్ణయాలపై తోటి కమిషనర్లు అభ్యంతరం తెలపడం దేశంలో పెద్ద దుమారం రేపింది. ఈ పరిణామంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్ణయాల్లో పారదర్శకత లోపించిందని ప్రతిపక్షాలు కూడ నిలదీస్తున్నాయి. మరోవైపు భిన్నాభిప్రాయాలు నిర్ణయ ప్రక్రియలో భాగమేనని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై కూడా తీవ్ర దుమారం చెలరేగింది.