ముక్కాంలో యువత కోసం జిమ్ క్రీడా పరికరాల ప్రారంభం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం పంచాయతీలో యువత క్రీడా అభివృద్ధికి లోకం మాధవి పెద్దపీట వేశారు. గ్రామంలో యువతకు క్రీడా స్ఫూర్తిని, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే లక్ష్యంతో నూతనంగా ఏర్పాటు చేసిన జిమ్, స్ట్రీట్ లైట్లు మరియు వివిధ క్రీడా పరికరాలను ఆమె ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, యువకులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ హర్షం వ్యక్తం చేశారు.