జీవితంలో తీవ్ర ఆందోళనలతో పోరాడానని వెల్లడించిన సిల్వెస్టర్ స్టాలిన్

రిపోర్టర్: రమేష్ స్థలం: Los Angeles

హాలీవుడ్ ప్రముఖ నటుడు సిల్వెస్టర్ స్టాలిన్ తన జీవితంలో ఎదుర్కొన్న వ్యక్తిగత కష్టాలు, మానసిక సమస్యల గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాను చాలాకాలంగా తీవ్రమైన ఆందోళనలతో పోరాడానని, రంబో సినిమా షూటింగ్ సమయంలో ఈటింగ్ డిజార్డర్ బారిన పడ్డానని తెలిపారు. ఫిట్నెస్ విషయంలో విపరీతమైన వ్యామోహం పెరిగిపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ అనుభవాలు తనను మానసికంగా ఎంతో కృంగదీశాయని, ఇప్పటికీ కొన్నిసార్లు ఆ సమస్యలు ఎదురవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.