అనిల్‌కుమార్‌ వ్యాఖ్యలపై తెదేపా ఎమ్మెల్సీ బీద రవిచంద్ర తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: వెంకట్ స్థలం: నెల్లూరు

మాజీ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌కు ఎన్నికలకు ముందు వేమిరెడ్డి దంపతుల వయసు తెలియదా అని తెదేపా ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ప్రశ్నించారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ విశ్వాసం గురించి మాట్లాడే అర్హత అనిల్‌కు లేదన్నారు. వైకాపా నాయకులు అక్రమాలపై విచారణ భయంతోనే కొత్త డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. 2029 ఎన్నికల్లో వీపీఆర్‌ సత్తా ఏంటో మరోసారి చూపిస్తామని హెచ్చరించారు.