ఎస్ కోటలో ఎన్నికల ప్రచారం: అభ్యర్థులను గెలిపించాలని కోరిన లలిత కుమారి

రిపోర్టర్: రాజేష్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా ఎస్ కోట మండలం ఎస్ కోట టౌన్ లో ఎంపీ శ్రీభారత్ తో కలిసి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొన్నట్లు లలిత కుమారి వెల్లడించారు. ఈ సందర్భంగా రాబోయే స్థానిక ఎన్నికల్ లో ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని స్థానిక ఓటర్లను కోరినట్లు ఆమె పేర్కొన్నారు. పార్టీ విజయం కోసం అందరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.