స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్గా అల్గోల్ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల ఎంపిక

రిపోర్టర్: విజయ్ స్థలం: సంగారెడ్డి

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని అల్గోల్ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్గా ఎంపికైందని మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ యూనుస్ తెలిపారు. పాఠశాలలో నిర్వహించిన అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న నాణ్యమైన విద్య గర్వకారణమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శిరీష సురేందర్ రెడ్డితో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.