గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో అత్యంత వైభవంగా 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం

రిపోర్టర్: సురేష్ స్థలం: గుజరాత్

గుజరాత్‌లోని ప్రసిద్ధ ప్రాంతమైన ఏక్తానగర్ వేదికగా మంగళవారం 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సమీపంలో జరిగే ఈ వేడుకకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముఖ్య అతిథిగా విచ్చేసి 2024 సంవత్సరానికి గాను విజేతలకు పురస్కారాలను అందజేయనున్నారు. దేశ నలుమూలల నుంచి ప్రముఖ సినీ దిగ్గజాలు, నటీనటులు హాజరుకానున్నారు.