విజయనగరంలో గుట్టుచప్పుడు కాకుండా నిషేధిత, కాలం చెల్లిన ఔషధాల విక్రయాలు

రిపోర్టర్: రమేష్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లాలో ఔషధ దుకాణాల నిబంధనల ఉల్లంఘనలపై ఔషధ నియంత్రణ ఇన్ఛార్జి సహాయ సంచాలకులు రజిత స్పందించారు. డాక్టర్ చీటీ లేకుండా మందులు అమ్మితే శాఖాపరమైన కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ఫార్మసిస్టులు లేకుండా నిర్వహిస్తే దుకాణాలను మూసివేస్తామని తెలిపారు. పూర్తిస్థాయి తనిఖీలు లేకపోవడంతోనే నిబంధనలు గాలికి వదిలేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.