తెలంగాణలో తీవ్ర ఉత్కంఠ: త్వరలో ఖాళీ కానున్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Hyderabad
తెలంగాణలో త్వరలో ఖాళీ కానున్న మూడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ ప్రక్రియపై రాజకీయ వర్గాలలో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ నెల పదిహేనుతో గోరేటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్ పదవీకాలం ముగియనుండటంతో ఆశావహుల లాబీయింగ్ తారాస్థాయికి చేరింది. సామాజిక సమీకరణాలను సమతుల్యం చేయడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద సవాల్‌గా మారిందని, కనీసం రెండు స్థానాలను బీసీలకే కేటాయిస్తామని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పష్టం చేశారు.