విద్యార్థులకు అలర్ట్: కర్ణాటక పదవ తరగతి పరీక్షల టైమ్‌టేబుల్ విడుదల
రిపోర్టర్: గోపి
స్థలం: బెంగుళూరు
కర్ణాటకలో పదవ తరగతి పరీక్షల నిర్వహణకు బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసిందని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు వచ్చే ఏడాది మార్చి 22 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు కేఎస్ఈఏబీ అధికారులు తెలిపారు. అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైందని, నవంబర్ 11వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.