తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు దుర్మరణం
రిపోర్టర్: హరి
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం బలభద్రరాజుపురంలో ఉపాధి కోసం తాటిచెట్టు ఎక్కిన గీత కార్మికుడు కొలుసు పైడిరాజు(40) మోకు తెగి కిందపడి దుర్మరణం చెందారు. బంగారమ్మపేట గ్రామానికి చెందిన పైడిరాజు సోమవారం ఉదయం చెట్టుపై కమ్మలు కొడుతుండగా ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. గజపతినగరం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోవడంతో భార్య పిల్లలు రోదిస్తున్న తీరు కలచివేసింది.