రణబాలి సినిమా నుంచి ఏందయ్యా స్వామి పూర్తి పాట విడుదల

రిపోర్టర్: హరి స్థలం: Hyderabad

టాలీవుడ్‌లో క్రేజీ జోడీగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నటిస్తున్న రణబాలి సినిమా నుంచి తాజాగా ఏందయ్యా స్వామి పూర్తి పాటను చిత్రబృందం విడుదల చేసింది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అజయ్-అతుల్ సంగీతం అందించారు. పల్లెటూరి జానపద శైలికి ఆధునిక మెలోడీ స్వరాలను జోడించి రూపొందించిన ఈ పాటలో విజయ్, రష్మికల మధ్య కెమిస్ట్రీ మరియు గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే దృశ్యాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.