దేవాలయంలో భక్తులకు మెరుగైన సేవలు అందిస్తామన్న వంగల తిరుమలేష్

రిపోర్టర్: Subhan.Manthani స్థలం: మంథని

శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దైవ సన్నిధిలో భక్తులకు మరింత మెరుగైన, దివ్యమైన సేవలు అందించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని ఆలయ కమిటీ నూతన అధ్యక్షుడు వంగల తిరుమలేష్ స్పష్టం చేశారు. మంథనిలో హిందుత్వ శ్రేష్ఠ వర్ధని, విద్యార్థి యువత సంయుక్త ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సత్కరించారు. రాబోయే పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ప్రజల అండదండలతో సేవా కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తామని ఈ సందర్భంగా తిరుమలేష్ వెల్లడించారు.