యూట్యూబర్ రమానందనకు అద్దంకి పోలీసుల నోటీసులు జారీ

రిపోర్టర్: గోపి స్థలం: బాపట్ల

యూకేలో ఉద్యోగాల పేరుతో రూ.10.60 లక్షలు వసూలు చేసి మోసం చేసిన కేసులో ప్రముఖ యూట్యూబర్, బిగ్‌బాస్ ఆశావాది రమానందనకు బాపట్ల జిల్లా అద్దంకి పోలీసులు నోటీసులు జారీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు జూన్‌లో కేసు నమోదు కాగా, విచారణలో భాగంగా శుక్రవారం ఆమె అద్దంకి పోలీస్ స్టేషన్‌కు హాజరయ్యారు. పోలీసులు ఆమెకు నోటీసులు అందజేసి విచారణకు సహకరించాలని సూచించారు.