ఆగిరిపల్లి మండలంలో కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
రిపోర్టర్: మహేష్
స్థలం: ఏలూరు
ఆగిరిపల్లి మండలంలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించే దిశగా రూ.1.44 కోట్ల అభివృద్ధి పనులకు రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి మరియు నూజివీడు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి శంకుస్థాపన చేసినట్లు వెల్లడించారు. నూజివీడు పట్టణంలోని జంక్షన్ రోడ్డులో వర్షకాలంలో ఎదురవుతున్న రాకపోకల ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని పేర్కొన్నారు. ఆగిరిపల్లి-విజయవాడ ప్రధాన రహదారి నుండి నుగొండపల్లి వరకు చేపడుతున్న ఈ పనుల ద్వారా స్థానికులకు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రాంత సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని స్పష్టం చేశారు.