ఎర్రవెల్లిలో తరతరాలుగా సాగు చేస్తున్న భూములను కాపాడాలని వేడుకోలు

రిపోర్టర్: నరేష్ స్థలం: ఎర్రవెల్లి

ఎర్రవెల్లి గ్రామంలో మా తాతా ముత్తాతల కాలం నుంచి రెండు వందల దళిత కుటుంబాలు భూములను సాగు చేసుకుంటూ బతుకుతున్నాయని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో కాలువలు, చెరువుల ద్వారా నీరు అంది పంటలు పండించామని తెలిపారు. మా ఉనికిని కాపాడి, జీవనాధారమైన ఈ భూములను మాకే దక్కేలా ప్రభుత్వాలు న్యాయం చేయాలని వారు మీడియాతో కోరారు.