నిరుద్యోగులకు గుడ్ న్యూస్: నవంబర్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన ఎస్ఎస్సీ

రిపోర్టర్: రమేష్ స్థలం: న్యూఢిల్లీ

దేశవ్యాప్తంగా వివిధ నియామక పరీక్షల షెడ్యూల్ ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసిందని అధికారులు తెలిపారు. నవంబర్ నెలలో జరగనున్న పరీక్షల వివరాలను అధికారిక వెబ్ సైట్ లో పొందుపరిచారు. కోస్ట్ గార్డ్ పరీక్షలు, స్టెనోగ్రాఫర్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ పరీక్ష తేదీలను ఖరారు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా షెడ్యూల్ ను పరిశీలించి డౌన్ లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.