ఆధార్ వ్యవస్థకు సవాల్గా మారిన కవలల బయోమెట్రిక్ సమస్య

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Rampur

ఉత్తరప్రదేశ్లోని రాంపూర్కు చెందిన పదో తరగతి విద్యార్థినులు ఖిజ్రా జుబేర్, తూబా జుబేర్ల బయోమెట్రిక్ వివరాలు ఒకేలా ఉండటంతో ఆధార్ వ్యవస్థలో డూప్లికేట్ సమస్య తలెత్తిందని అధికారులు తెలిపారు. బోర్డు పరీక్షల రిజిస్ట్రేషన్ సమయంలో వేలిముద్రలు, ఐరిస్ నమూనాలు సరిపోలక ఒకరిని సిస్టమ్ తిరస్కరించింది. ఈ వింత సమస్యపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందడంతో జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. నాలుగు నెలల పాటు ప్రత్యేక పరిశీలన నిర్వహించి సాంకేతిక నిపుణుల సాయంతో ఇద్దరికీ వేర్వేరు ఆధార్ నంబర్లు జారీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.