ఓట్ బచావో దేశ్ బచావో మహా మార్చ్‌ను ప్రారంభించిన తెలంగాణ కాంగ్రెస్
రిపోర్టర్: మహేష్
స్థలం: New Delhi
న్యూఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఓట్ బచావో దేశ్ బచావో మహా మార్చ్ నిర్వహించినట్లు ఆ పార్టీ అధికారికంగా వెల్లడించింది. మింటో రోడ్ జంక్షన్ నుంచి రాంలీలా మైదాన్ వరకు భారీగా ఈ కార్యక్రమం కొనసాగిందని తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ లక్ష్యంగా ఈ మహా మార్చ్ చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ నిరసన ప్రదర్శనలో పలువురు కాంగ్రెస్ శ్రేణులు, నేతలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా రాజకీయాల్ లో ఈ కార్యక్రమం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.