బెల్లంపల్లిలో భవానీ భక్తుల విజయయాత్రను కొబ్బరికాయ కొట్టి సాగనంపిన నాతరి స్వామి
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామపంచాయతీ పరిధిలోని బంగారు మైసమ్మ ఆలయం నుంచి దుర్గామాత మాల విరమణకు బయలుదేరిన భవానీ స్వాములను టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి కొబ్బరికాయ కొట్టి సాగనంపారు. ఈ సందర్భంగా భవానీ భక్తులపై దుర్గామాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.