అమెరికా ఇరాన్ మధ్య దౌత్య చర్చలు విఫలమంటూ డొనాల్డ్ ట్రంప్ ప్రకటన
రిపోర్టర్: నరేష్
స్థలం: Washington
అమెరికా ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఖతార్ దేశం చేపట్టిన దౌత్య రాయబార ప్రయత్నాలు పూర్తిగా విఫలమైనట్లు ఖతార్ ప్రతినిధులు వెల్లడించారు. న్యూయార్క్ మరియు వాషింగ్టన్లలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశాల్లో ఇరు దేశాలు తమ మొండి వైఖరిని వీడకపోవడంతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ చర్చలను తలకిందులు చేసిందని విశ్లేషకులు స్పష్టం చేశారు. దీంతో పశ్చిమాసియాలో మళ్లీ తీవ్ర యుద్ధ మేఘాలు అలముకున్నాయి.