డేవిస్ కప్ లో భారత్ కు పరాభవం సుమిత్ నాగల్ ఓటమి

రిపోర్టర్: సునీల్ స్థలం: Seoul

సియోల్ వేదికగా జరిగిన డేవిస్ కప్ క్వాలిఫైయర్ రెండో రౌండ్ లో భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నాగల్ కొరియా ఆటగాడు సూన్ వూ క్వోన్ చేతిలో 1-6, 2-6 తేడాతో పరాజయం పాలయ్యాడు. ఈ గెలుపుతో కొరియా 3-1 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుని ప్రపంచ గ్రూప్ ఫైనల్స్ కు దూసుకెళ్లింది. అలసట కారణంగా నాగల్ తన అత్యుత్తమ ప్రదర్శన కనబరచలేకపోవడంతో భారత్ కు ఓటమి తప్పలేదు.