గంట్యాడలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్

రిపోర్టర్: విజయ్ స్థలం: Vizianagaram

విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం గంట్యాడ మండలం గొడియాడ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని, సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తోందని ఆయన తెలిపారు. అనంతరం జామి మండలం భీమసింగిలో రీ సర్వే చేసిన భూముల రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు.