భోగాపురం ఎయిర్పోర్టులో భారీ డ్రగ్స్ పట్టివేత: నాలుగు కోట్ల గంజాయి స్వాధీనం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: భోగాపురం

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద సుమారు నాలుగు కోట్ల రూపాయల విలువైన నాలుగు కేజీల హైడ్రోఫోనిక్ గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న ఈ నిషేధిత పదార్థంపై కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.