'తల్లిని దూషించే కుసంస్కారం ఏంటి?': దళిత స్పీకర్ అవమానంపై మంత్రి సీతక్క ఫైర్
రిపోర్టర్: రాము
స్థలం: Hyderabad
దళిత వర్గానికి చెందిన స్పీకర్‌ను 'వాడు-వీడు' అంటూ అవమానించడం, ఆయన తల్లిని జుగుప్సాకరంగా దూషించడం అత్యంత దుర్మార్గమని మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ కొడుకైనా తన తల్లిని దూషిస్తే సహించలేడని, అలాంటిది ఉన్నత స్థానంలో ఉన్న దళిత స్పీకర్ పట్ల ఇలా వ్యవహరించడంపై ఆమె తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు.