'నేరాల నియంత్రణే లక్ష్యం': నెల్లూరు జిల్లాలో ముమ్మరంగా విజిబుల్ పోలీసింగ్
రిపోర్టర్: సునీల్
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణ మరియు నేరాల నియంత్రణ లక్ష్యంగా పోలీసులు విజిబుల్ పోలీసింగ్‌ను ముమ్మరం చేశారు. ప్రధాన కూడళ్లు, రద్దీ రోడ్లు మరియు కీలక ప్రాంతాలలో విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాత్రి సమయాలలో ప్రత్యేక పెట్రోలింగ్ చేపట్టి, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్, అక్రమ రవాణా అలాగే ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలపై నిఘా ఉంచినట్లు అధికారులు తెలిపారు.