రైతులు ప్రజలు సుభిక్షంగా ఉండాలంటూ వరుణ యాగంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్
రిపోర్టర్: గోపి
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ వరుణ యాగంలో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నర్రవాడ శ్రీ వేంగమాంబ పేరంటాలు అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో మంగళవారం ఈ ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ అర్చకులు, నాయకులు మరియు అధిక సంఖ్యలో భక్తులు ఘనంగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు సమర్పించారు.