యుద్ధ నిధుల కోసం అడల్ట్ ఇండస్ట్రీని చట్టబద్ధం చేయనున్న ఉక్రెయిన్
రిపోర్టర్: శివ
స్థలం: World
యుద్ధ నిధులు సమకూర్చుకోవడం మరియు పన్నుల ద్వారా ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో ఉక్రెయిన్ అడల్ట్ ఇండస్ట్రీని చట్టబద్ధం చేసే దిశగా అడుగులు వేస్తోంది. పార్లమెంట్లో దీనికి సంబంధించిన బిల్లు మొదటి దశ ఆమోదం పొందింది. ఈ నిర్ణయం ద్వారా ఏటా సుమారు 25 మిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని, దీనితో సుమారు 30 వేల డ్రోన్లను కొనుగోలు చేయవచ్చని ఎంపీ యారోస్లావ్ జెహ్లెజ్నియాక్ తెలిపారు.